మహిళా కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవం: ఆత్మస్థైర్యంతో జీవించాలని న్యాయాధిపతుల పిలుపు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని ప్రత్యేక మహిళా కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట కోర్టు న్యాయాధిపతులు ప్రతీక్ సిహాగ్, మహమ్మద్ యూసఫ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఖైదీలు ఆత్మస్థైర్యంతో ఉండి, భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, సిబ్బంది, మహిళా ఖైదీలు ఉత్సాహంగా పాల్గొన్నారు.