భక్తిశ్రద్ధలతో కామారెడ్డిలో వైభవంగా ముగిసిన గణేష్ నిమజ్జన ఉత్సవాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా ముగిశాయని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. మార్మోగుతున్న డప్పుల దరువుల మధ్య భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి గణనాథులకు వీడ్కోలు పలికారు. డ్రోన్ విజువల్స్‌లో ఈ నిమజ్జన శోభ అద్భుతంగా కనువిందు చేసిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల ఉత్సాహం మధ్య నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా సాగింది.