షాకింగ్ ఘటన: ఎస్బీఐ బ్యాంకు ఖాతాలపై సైబర్ ఎటాక్ కలకలం

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ ఖాతాలపై సైబర్ దాడి జరిగినట్లు స్వయంగా ఆ బ్యాంకు వెల్లడించింది. సుమారు మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వ్యక్తిగత డేటా డార్క్ వెబ్లోకి వెళ్లినట్లు ఎస్బీఐ అధికారులు స్పష్టం చేశారు. కస్టమర్ల మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు లీక్ అయిన ఈ ఘటనపై సమగ్ర విచారణను ప్రారంభించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ నివేదికలో అధికారులు తెలిపారు.