హైస్పీడ్ రైల్ అలైన్మెంట్పై కేంద్ర మంత్రి ప్రకటనతో తెలంగాణలో రాజకీయ కలకలం

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

హైస్పీడ్ రైల్ కారిడార్ల అలైన్మెంట్ ఇంకా ఖరారు కాలేదని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ స్పష్టం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రాజెక్టు పేరుతో భూసేకరణ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అలైన్మెంట్ ఖరారు కాకముందే భూసేకరణకు ప్రభుత్వం పూనుకుంటోందంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.