పక్షుల రక్షణ కోసం అంధకారంలోకి ద్వీపం: రాత్రిపూట పూర్తిగా లైట్లు బంద్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Corvo

పోర్చుగల్ లోని అజోర్స్ ద్వీప సమూహంలో భాగమైన కోర్వో దీవిలో అరుదైన పక్షుల రక్షణ కోసం వినూత్న చర్యలు చేపట్టారు. ప్రతి శరదృతువులో యువ సముద్రపు పక్షులు తమ తొలి ప్రయాణం సురక్షితంగా సాగించేందుకు ఐదు రోజుల పాటు వీధి దీపాలను పూర్తిగా ఆర్పుతున్నట్లు పోర్చుగీస్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ బర్డ్స్ ప్రతినిధులు తెలిపారు. కృత్రిమ కాంతులతో దారితప్పుతున్న పక్షులను రక్షించేందుకు స్థానికులు రాత్రి వేళల్ లో గస్తీ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.