మంగళగిరిలో మూడు వందల డెబ్బై రెండు మందికి ఉచిత ఆస్తి హక్కుల పట్టాలు అందజేత

రిపోర్టర్: శివ స్థలం: మంగళగిరి

మంగళగిరి నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయల విలువైన భూములకు శాశ్వత ఆస్తి హక్కులు కల్పించామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కుంచనపల్లిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేశ్ కార్యక్రమంలో మూడు వందల డెబ్బై రెండు మందికి ఉచితంగా ఆస్తి హక్కుల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టుదలతో పని చేస్తున్నామని, రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని ఈ సందర్భంగా లోకేశ్ స్పష్టం చేశారు.