'మాదిగల చేతిలో దేహశుద్ధి తప్పదు': ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి శ్రీనివాస్ వార్నింగ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న హమారా ప్రసాద్‌కు మాదిగల చేతిలో దేహశుద్ధి తప్పదని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ విద్యానగర్‌లో ఉన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంబేద్కర్‌పై ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, పుస్తక ఆవిష్కరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు.