యూపీఐ డిజిటల్ పేమెంట్స్‌పై కొత్త ఛార్జీల వడ్డనపై రాహుల్ గాంధీ ఆగ్రహం
రిపోర్టర్: హరి
స్థలం: New Delhi
యూపీఐని దేశవ్యాప్తంగా ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే డిజిటల్ పేమెంట్స్‌పై కొత్త ఛార్జీలు ఎందుకు విధిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో నిలదీశారు. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన కొన్ని మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి రానుండటాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ ఛార్జీలు నేరుగా మర్చంట్లపై పడతాయని, చిన్న వ్యాపారాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.