రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు గురుకుల విద్యార్థినులు షాలిని హరిప్రియ ఎంపికయ్యారు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్షేట్టిపేట

లక్షేట్టిపేట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు ఏ షాలిని, బిహరిప్రియ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇచ్చోడలో జరిగిన ఎస్జిఎఫ్ అండర్ 17 పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించారు. గోదావరిఖనిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో వారు పాల్గొంటారని ప్రిన్సిపాల్ రమా కల్యాణి తెలిపారు. తమ ప్రతిభతో పాఠశాలకు పేరు తెచ్చిన ఆ విద్యార్థినులను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఘనంగా అభినందించారు.