నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ బహిష్కరించింది. కూటమి ధర్మాన్ని విస్మరించి ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడంతో రాష్ట్ర, జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఎంపీ సీఎం రమేష్ మూడు స్థానాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విలేకరుల సమావేశంలో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.