మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ బలవన్మరణం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్‌కు చెందిన 35 ఏళ్ల ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ తన ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగుచూసింది. పెళ్లికి సంబంధించిన వ్యక్తిగత సమస్యలతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మృతి చెందడానికి ముందు ఆయన ఒక మహిళకు వీడియో కాల్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.