సికింద్రాబాద్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మహబూబ్‌నగర్‌లో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్‌ఛార్జ్‌ల సహకారంతోనే ఈ చోరీ జరిగినట్లు అనుమానిస్తున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ త్వరలోనే పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.