మనుబోలులో వెయ్యి ఓట్ల భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ప్రసాద్ ధీమా
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
మనుబోలు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గురివిందపూడి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జెడ్పీటీసీ అభ్యర్థి పొట్టేళ్ల ప్రసాద్, ఎంపీటీసీ అభ్యర్థి మన్నెమాల సుజిత పాల్గొని ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మండలంలో తమ అభ్యర్థుల విజయం ఖాయమని, వెయ్యి ఓట్ల మెజార్టీ సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.