డీఎస్సీపై వైకాపా తప్పుడు ప్రచారం: తెదేపా ఎమ్మెల్యేల మండిపాటు
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై వైకాపా, సాక్షి మీడియా పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెదేపా ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని జగన్ పూటకో ప్రెస్‌మీట్ పెడుతూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన యువతపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, జగన్ రాజకీయ జీవితమే ఒక ఫేక్ అని విమర్శించారు.