చిట్వేల్ ఉన్నత పాఠశాలలో విద్యా ప్రమాణాలపై క్లస్టర్ సమీక్ష

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

చిట్వేల్ పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ నెల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు సోఫియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మండల విద్యాశాఖ అధికారులు ఖాజా మొహిద్దీన్, ఈశ్వరయ్య హాజరై విద్యార్థుల అభ్యసనా ఫలితాలు, ఎఫ్ఏ-1 ఫలితాలు, ప్రాథమిక అక్షరాస్యతపై సమీక్షించారు. డిజిటల్ విద్యా వనరులు, ఆధునిక బోధనా పద్ధతులు పాటించాలని సూచించారు.