కడ్తల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కడ్తల్

కడ్తల్ మండలం బాలాజీనగర్ తండాలోని శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకృష్ణుడి జీవితం ధర్మం, న్యాయం, కర్తవ్యనిష్ఠకు ప్రతీక అని పేర్కొన్నారు. భగవద్గీతలోని కర్మయోగ సందేశం మానవాళికి స్ఫూర్తిదాయకమని, యువత క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.