తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయి ఎండలు విపరీతంగా కాస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావం కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎక్కడా వర్షాలు పడే సూచనలు లేకపోవడంతో పగటి పూట వేడి మరియు ఉక్కపోత తీవ్రంగా ఉందని, మధ్యాహ్నం వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.