పంతంగి గ్రామంలో భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమజ్జన వేడుకలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామంలో శ్రీ గణవీర్ యువసేన ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జన వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మేళతాళాల మధ్య గణనాథుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకల్లో సందడి చేశారు. లడ్డూ వేలం పాటలో బండ రాజయ్య దంపతులు రూ.10,116కు లడ్డూను కైవసం చేసుకున్నారు..బర్మా లింగస్వామి నాగరాణి దంపతులు పండ్లను రూ.6,116కు కైవసం చేసుకున్నారు.కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు వెలిజాల నరహరి, వార్డు సభ్యులు బండ శేఖర్, వెలిజాల అశోక్, కడెం రామచంద్రం, కడగంచి కొండయ్య, నాటి సతీష్, చినుకని యువరాజుతో పాటు మహిళలు, పిల్లలు, భక్తులు పాల్గొన్నారు.