రాజమహేంద్రవరం: పాడి పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా కృషి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య

రిపోర్టర్: సతీష్ స్థలం: తూర్పు గోదావరి

పాడి పరిశ్రమ అభివృద్ధికి మరియు పశు సంపద పెంపుదలకు అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున కృషి చేయడం జరుగుతుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. అన్ని రకాల ఆధునిక మందులతో పాడి పరిశ్రమను పెంపొందించే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. పాల ఉత్పత్తిని భారీగా పెంచి, రైతులకు పాడి పరిశ్రమను మరింత లాభసాటిగా మార్చే ప్రక్రియకు త్వరలోనే శ్రీకారం చుట్టడం జరుగుతుందని వెల్లడించారు.