కావలి ఉపాధ్యాయునికి అరుదైన గౌరవం: రాష్ట్ర స్థాయి పోటీల్లో షాట్‌పుట్ విజయం
రిపోర్టర్: రాము
స్థలం: నెల్లూరు
కావలి మండలంలోని సర్వాయపాలెం పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గౌతమ రాఘవరావును తోటి ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో ఆయన షాట్‌పుట్‌లో ప్రథమ స్థానం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు తోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వయస్సుతో సంబంధం లేకుండా పట్టుదలతో సాధన చేస్తే అద్భుతమైన విజయాలు సొంతం చేసుకోవచ్చని నిరూపించారని రాఘవరావును కొనియాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని సూచించారు.