వైవిధ్యమైన కథాంశంతో అక్టోబర్ రెండున ఇంప్యూర్ చిత్రం విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

టెలివిజన్ మరియు చలనచిత్ర రంగంలో సరికొత్త ప్రయోగానికి తెరలేపుతూ వారాహి మల్లిపాముల నిర్మించి నటించిన ఇంప్యూర్ చిత్రం అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాత వారాహి తెలిపారు. వివాహ వ్యవస్థలోని సున్నితమైన అంశాలను స్పృశిస్తూ నిశాంతి ఎవాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యషా ముత్తులూరి ప్రధాన పాత్ర పోషించారు. గ్రామీ నామినేటెడ్ కళాకారులు సంగీతం అందించిన ఈ సినిమా మహిళా ప్రాధాన్య చిత్రాలకు సరికొత్త దిశను నిర్దేశిస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.