తెలంగాణ అసెంబ్లీ నిర్వహణకు ప్రతి గంటకు భారీ ఖర్చు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణ శాసనసభ నిర్వహణకు భారీగా ఖర్చు అవుతోంది. సభలో ప్రతి గంటకు రూ.15 నుంచి 20 లక్షల వరకు వ్యయం అవుతున్నట్లు పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. అధికారుల భత్యాలు, రవాణా, ఏసీలు, లైటింగ్ ఏర్పాట్లతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోటి నుంచి కోటిన్నర వరకు ఖర్చవుతుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.