ఏపీలో విచ్చలవిడిగా మత్తు మందుల విక్రయంపై డ్రగ్ కంట్రోల్ శాఖ ఉక్కుపాదం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Amaravati
రాష్ట్రంలో ఇథనాల్ ఆధారిత శానిటైజర్లు, ట్రెమడాల్ వంటి షెడ్యూల్ డ్రగ్స్‌ను మత్తు కోసం విచ్చలవిడిగా విక్రయిస్తున్న అక్రమార్కులపై ఏపీ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టగా నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న పలు మెడికల్ షాపులపై కేసులు నమోదు చేసి క్లోజర్ ఆర్డర్లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.