కాంగ్రెస్ పదవులకు హరీశ్ రావత్ రాజీనామా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ కాంగ్రెస్ పార్టీలోని కీలక పదవులకు రాజీనామా చేశారు. ఆయన మాజీ పీఏ చందన్ సింగ్ జీనా నివాసంలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా నగదు, బంగారం లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.