క్యామెరాల నుంచి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్ హైడర్ వాడిన SUV

రిపోర్టర్: మహేష్ స్థలం: Maharashtra

పుణె-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు కార్ నంబర్ ప్లేట్‌ను ఆటోమేటిక్‌గా కప్పివేసే పరికరాన్ని అమర్చిన ఎస్‌యూవీ యజమానిని ఆర్టీఓ అధికారులు గుర్తించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అధికారులు వాహనాన్ని గుర్తించి రూ. 4,500 జరిమానా విధించారు. ఈ వాహనానికి ఇప్పటికే 55 ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది.