విశాఖలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవు ప్రకటన
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా మధురవాడలో 66.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈఓ ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. మరోవైపు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేశారు.