సైబర్ మోసాలపై సైబరాబాద్ పోలీసుల కీలక హెచ్చరిక: అప్రమత్తంగా ఉండాలని సూచన

రిపోర్టర్: శివ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

డిజిటల్ ప్రపంచంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని, సోషల్ మీడియాలో ఏదైనా సమాచారం షేర్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచిస్తూ సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.