తురకకాశ ముస్లింలకే జీవనోపాధి యంత్రాలు అందించాలని డిమాండ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని అంజనాపురంలో తురకకాశ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ బికారి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాళ్లు కట్ చేసే మిషన్ జనరేటర్ స్కీంను ముస్లిం మైనార్టీలందరికీ కాకుండా కేవలం తురకకాశ ముస్లింలకే వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో అర్హులైన కార్మికులను గుర్తించి ఈ పథకాన్ని అందించాలని కలెక్టర్, మైనార్టీ వెల్ఫేర్ అధికారులను కోరారు.