భారీ షాక్: రష్యా నుంచి పడిపోయిన ముడి చమురు దిగుమతులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
భారతదేశానికి రష్యా నుంచి జరిగే ముడి చమురు దిగుమతులలో గత సెప్టెంబరు నెలలో గణనీయమైన క్షీణత నమోదైందని నిపుణులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిస్థితులతో పాటు చైనా వైపు నుంచి పెరుగుతున్న తీవ్ర పోటీ కారణంగా దిగుమతులు పడిపోయి రోజువారీగా కేవలం 1.82 మిలియన్ బ్యారెళ్ల చమురు మాత్రమే దిగుమతి అయిందని వారు తెలిపారు. రష్యా చమురు దిగుమతులలో నెలకొన్న ఈ తగ్గుదల భారత ఇంధన దిగుమతుల వ్యూహంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.