కూలీల కొరతతో కుదేలవుతున్న నిజామాబాద్ మధ్యతరగతి సొంతింటి కల

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాలో సొంతింటి నిర్మాణం ప్రారంభించిన మధ్యతరగతి ప్రజలకు కూలీల కొరత, పెరిగిన రేట్లు తీవ్ర తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అడ్వాన్స్‌లు తీసుకున్న మేస్త్రీలు, కార్మికులు చెప్పిన సమయానికి పనులు ప్రారంభించకపోవడం, వాయిదాలు వేయడంతో నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. పనులు ఆలస్యం కావడం వల్ల సామగ్రి ధరలు, వడ్డీలు, అద్దెల భారంతో పాటు మొత్తం బడ్జెట్ తారుమారై తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నామని నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.