బెంగళూరు జారా స్టోర్ లో దారుణం: దొంగతనం ఆరోపణలతో దుస్తులు విప్పాలని మహిళ వేధింపు

రిపోర్టర్: మహేష్ స్థలం: Bengaluru

బెంగళూరులోని ఫోరమ్ సౌత్ మాల్ జారా స్టోర్ లో సెక్యూరిటీ అలారం మోగడంతో షాకింగ్ ఘటన చోటుచేసుకుందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి వస్తువులు దొంగిలించకపోయినా సిబ్బంది ఫీటింగ్ రూమ్ కు తీసుకెళ్లి బట్టలు విప్పాలని తీవ్రంగా ఒత్తిడి చేశారని, అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, వినియోగదారుల హక్కులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.