వైట్ హౌస్‌లో నన్ను షూట్ చేస్తారన్న ట్రంప్: మార్క్ కార్నీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు వైట్ హౌస్ బంగారు తాళం చెవిని ఇచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు. ఆ తాళం చెవితో లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తే సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపుతారని ట్రంప్ సరదాగా హెచ్చరించినట్లు కార్నీ తెలిపారు. కెనడా-అమెరికా సంబంధాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.