మహిళల భద్రత బాధ్యత కేవలం వారిపైనే నెట్టడం సరికాదు

రిపోర్టర్: శివ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కళాశాల సమీపంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం నేపథ్యంలో తరగతులను ఆన్‌లైన్‌కు మార్చడంపై విద్యార్థి సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మహిళల భద్రత బాధ్యత కేవలం మహిళలపైనే ఉండకూడదని, బహిరంగ ప్రదేశాల్లో కఠిన భద్రతా చర్యలు, పోలీసు గస్తీని పెంచాలని విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అనూషా గార్గ్ డిమాండ్ చేశారు. భద్రతా వైఫల్యాలపై కాలజీ ప్రిన్సిపాల్ కనికా కె అహుజా స్పందిస్తూ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.