కొండమడుగులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే అనిల్

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.