తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును కలిసిన జేబీ శ్రీనివాస్
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి
తిరుపతి పర్యటనకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఓ ప్రైవేట్ హోటల్లో ఆయనను శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించి పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తాతయ్య గుంట ఆలయ ఛైర్మన్ మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.