కొత్తవలస మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎస్ఎంసీ ఎన్నికలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కొత్తవలస
కొత్తవలస మండలంలో పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలు ఈరోజు ప్రశాంతంగా ముగిసినట్లు ఎంఈఓలు జి.శ్రీదేవి, బి. శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తం అరవై ఏడు పాఠశాలలకు గాను యాభై రెండు చోట్ల ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. మరో పదిహేను పాఠశాలల్లో చేతులెత్తే పద్ధతి ద్వారా ఛైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, నిబంధనల ప్రకారం తొలి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు.