షారుఖ్ ఖాన్ గొప్ప మనసు: పారితోషికం వదులుకున్న బాలీవుడ్ బాద్షా
రిపోర్టర్: కిరణ్
స్థలం: Mumbai
బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ తన గొప్ప మనసుతో అందరినీ ఆశ్చర్యపరిచారని నిర్మాత కేసీ బొకాడియా తాజాగా వెల్లడించారు. ‘హమ్ తుమ్హారే హై సనమ్’ సినిమా షూటింగ్ సమయంలో తనకు రావాల్సిన మిగిలిన పారితోషికం 95 లక్షల రూపాయలను షారుఖ్ ఖాన్ వదులుకున్నారని ఆయన పేర్కొన్నారు. నిర్మాతపై ఉన్న గౌరవం, వ్యక్తిగత అనుబంధం కారణంగానే షారుఖ్ ఖాన్ ఆ డబ్బు తీసుకోలేదని, ఇండస్ట్రీలో ఆయన గొప్పతనం గురించి బొకాడియా చెప్పుకొచ్చారు.