సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అల్లూరి పోలీసులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో సైబర్ నేరాల పట్ల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు హెచ్చరించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు అలాగే సందేహాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, ఏటీఎం పిన్ నంబర్లు ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. అనుమానాస్పద ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పోలీసులు కోరారు.