రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం: ఆసుపత్రిలో వైద్యులు లేక ప్రాణాలు గాలిలోకం

రిపోర్టర్: సతీష్ స్థలం: Medak

మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం ఔరంగాబాద్ లో ధాన్యం విక్రయించుకునేందుకు పొలానికి వెళ్తున్న తిరుపతి కిషన్ అనే రైతును కారు ఢీకొట్టిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడం మరియు విద్యుత్ సదుపాయం లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక మృతి చెందారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.