ఓటర్ల జాబితా సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన ఈసీ
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా లోపాలున్నాయంటూ 44,28,444 మందికి ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటివరకు 44,00,225 మంది విచారణ పూర్తి కాగా, 1,53,600 మందిని అనర్హులుగా తేల్చారు. అక్టోబరు 9న ప్రచురించే తుది జాబితాలో 41,00,002 మందిని కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికారులు స్పష్టం చేశారు.