ప్రపంచ ఛాంపియన్షిప్ సమరం: గుకేష్, సిందారోవ్ పోరుపై గ్రాండ్మాస్టర్ల విశ్లేషణ

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

జెనీవా వేదికగా జరగనున్న ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోరులో భారత్ యువ సంచలనం డి గూకేష్, ఉజ్బెకిస్తాన్ ఆటగాడు జావోహిర్ సిందారోవ్ తలపడనున్నారు. ఈ చమత్కార సమరంపై రష్యా నంబర్ వన్ ఇయాన్ నెపోనియామ్చి స్పందిస్తూ, ఇటీవల కాలంలో గూకేష్ ప్రదర్శన నిరాశజనకంగా సాగుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో సిందారోంచే ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాడని స్పష్టం చేశారు. అయితే మ్యాచ్లలో ఒక్క విజయంతోనే సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని ఆయన పేర్కొన్నారు.