శంషాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
రిపోర్టర్: శివ
స్థలం: Shamshabad
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి కల్వర్టును కారు బలంగా ఢీకొన్న ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామానికి చెందిన కేతావత్ లింబ్య, జమున, కేతావత్ మానసింగ్, కేతావత్ వాస్రామ్‌గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.