జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు: అమ్మాయిల అద్భుత విజయం, పది వేలు దాటిన అర్హత
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షలో మహిళా అభ్యర్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ నివేదిక వెల్లడించింది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది పది వేలకు పైగా అమ్మాయిలు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. మహిళల అర్హత రేటు ఇరవై మూడు శాతానికి పైగా పెరిగిందని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉతీర్ణత కూడా గణనీయంగా మెరుగుపడిందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.