రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్కు ఎంపికైన విద్యార్థిని పి తేజస్విని

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా హైస్కూల్లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి నేషనల్ సైన్స్ సెమినార్లో కాశీబుగ్గ హైస్కూలు విద్యార్థిని పి. తేజస్విని ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. భారతదేశ శక్తి పాత్ర - 2047 అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీలలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి విద్యార్థులు పాల్గొనగా, డీఈఓ రవికుమార్ ఆమెకు మొదటి బహుమతి అందజేశారు.