మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ప్రారంభం

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, రహదారులు, వీధిదీపాలు మరియు ఇతర పౌర సమస్యలపై స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ స్థాయి అధికారులు, ఇతర సిబ్బంది మరియు పరిధిలోని ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.