తెలుగు రాష్ట్రాల బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా మధుకర్ నియామకం

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ బ్యూరో

భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కీలక నియామకాలు జరిగాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉత్తర్వుల మేరకు తెలుగు రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా మధుకర్‌ను నియమించారు. అలాగే తెలంగాణ సంయుక్త సంస్థాగత ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దశరథ్‌కు అప్పగించారు. ఈ నియామకాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రాజకీయ పరిణామాలు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.