నా దుస్తులపై విమర్శలు: ట్రోలర్స్‌పై నటి కృతిసనన్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
రక్షాబంధన్ ప్రకటనలో తాను ధరించిన దుస్తులపై వచ్చిన విమర్శల వివాదంపై బాలీవుడ్ నటి కృతిసనన్ మరోమారు స్పందించారు. ఇతరులను జడ్జ్ చేస్తూ తీర్పులు ఇవ్వడం చాలా సులభమని ఆమె మండిపడ్డారు. కరీనా కపూర్ నిర్వహిస్తున్న ఒక షోలో పాల్గొన్న సందర్భంగా కృతిసనన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన డ్రెస్ వివాదం ప్రైమ్‌టైమ్ డిబేట్‌గా మారుతుందని ఊహించలేదని, ఎవరి పని వారు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆమె స్పష్టం చేశారు.