జగన్నాధపురంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: Bhradwaj
స్థలం: మునగాల
మునగాల మండలంలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు మాట్లాడుతూ, రాధాకృష్ణన్ జీవిత విశేషాలను, విద్య ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం సతీష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.