'ప్రధాని మోదీ సేవలు అద్భుతం': కోల్కతాలో నరేంద్ర మోదీ మైనపు విగ్రహం ఆవిష్కరణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: కొల్కతా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు మరియు ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. కోల్కతాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసన్ సోల్కు చెందిన ప్రముఖ శిల్పి సుశాంత్ రాయ్ తీర్చిదిద్దిన 5.7 అడుగుల విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహానికి బెంగాలీ సంప్రదాయ ధోతీ, కుర్తాను అలంకరించగా, మోదీ పరిపాలన దక్షతను, దేశానికి ఆయన అందించిన సేవలను నాయకులు కొనియాడారు.