మానకొండూర్ వద్ద ఆటో బోల్తా పడి ఐదుగురికి తీవ్ర గాయాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కరీంనగర్
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పెద్దమ్మ గుడి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మానకొండూర్ నుండి కరీంనగర్ వైపు వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో స్పందించిన ప్రజలు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.